సినీనటి శారదకు కలైమామణి అవార్డు
Sakshi Education
సినీనటి శారదకు కలైమామణి-2018 అవార్డు లభించింది.
ఈ మేరకు 2018 సంవత్సరానికిగాను కలైమామణి అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 28న ప్రకటించింది. శారదతోపాటు కాంచన, కుట్టి పద్మినికి ఈ అవార్డు దక్కింది. అలాగే నటులు సూర్య, కార్తీ, విజయ్‌సేతుపతి, ప్రభుదేవా, విజయ్‌ఆంటోని, శశికుమార్, సంతానం, సూరి, నటి ప్రియమణి, నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు హరిలకు కూడా అవార్డులు దక్కాయి. మరోవైపు ప్రముఖ నటీమణి వైజయంతిమాల బాలి.. బాలసరస్వతి అవార్డుకు ఎంపికయ్యారు. కళారంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కలైమామణి-2018 అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : సినీనటి శారద
ఎక్కడ : తమిళనాడు
ఎందుకు : కళారంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కలైమామణి-2018 అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : సినీనటి శారద
ఎక్కడ : తమిళనాడు
ఎందుకు : కళారంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ
Published date : 01 Mar 2019 05:43PM