సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
Sakshi Education
ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ (57) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 31న తుదిశ్వాస విడిచారు.
1963, మే 15న హైదరాబాద్‌లో జన్మించిన నర్సింగ్ యాదవ్ ఇంటర్ వరకు చదువుకున్నారు. హేమా హేమీలు అనే తెలుగు సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన నర్సింగ్ యాదవ్‌కి ‘క్షణ క్షణం’చిత్రంతో మంచి పేరొచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా తనదైన శైలిలో ఆయన ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో ఆయన నటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సినీ నటుడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : నర్సింగ్ యాదవ్ (57)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సినీ నటుడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : నర్సింగ్ యాదవ్ (57)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా
Published date : 01 Jan 2021 06:06PM