సినీ నటుడు నారాయణమూర్తికి జాతీయ అవార్డు
Sakshi Education
ప్రముఖ సినీ నటుడు, ప్రజా చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ అవార్డు లభించింది.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 13న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతులమీదుగా నారాయణమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. హనుమంతు తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్య స్ఫూర్తిని రగిలించారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
ఎక్కడ : హైదరాబాద్
Published date : 14 Oct 2019 05:48PM