సినాడ్ అండర్ సెక్రటరీగా ఎంపికైన తొలి మహిళ?
చర్చికి సంబంధించిన విషయాల్లో సూక్ష్మపరిశీలన, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలకంగా మారాలన్న పోప్ ఫ్రాన్సిస్(రోమన్ క్యాథలిక్కుల గురువు) ఆకాంక్ష మేరకు ఈ నియామకం జరిగిందని సినాడ్ సెక్రటరీ జనరల్ కార్డినల్ మరియో గ్రెక్ ఫిబ్రవరి 7న తెలిపారు. బెకార్ట్‌కు కూడా ఓటింగ్ హక్కు కల్పించినట్లు తెలిపారు. బెకార్ట్‌తో పాటు స్పెయిన్‌కు చెందిన లూయిస్ మారిన్ డీ సాన్ మార్టిన్ అనే వ్యక్తి కూడా సినాడ్ అండర్ సెక్రటరీ పదవికి ఎంపికయ్యారు.
సినాడ్ ...
క్రైస్తవ మతంలో సిద్ధాంతపరంగా తలెత్తే ప్రధాన ప్రశ్నలపై సినాడ్ అధ్యయనం చేస్తుంది. సినాడ్‌లో బిషప్పులు, కార్డినల్స్ తోపాటు నిపుణులు కూడా ఉంటారు. వీరిలో బిషప్పులు, కార్డినల్స్‌కు మాత్రమే ఓటింగ్ హక్కులుంటాయి. గతంలో నిపుణులుగా, పరిశీల కులుగా మాత్రమే మహిళలు సినాడ్‌లో ఉండే వారు.
బెకార్ట్ గురించి...
ఫ్రాన్సులోని జేవియర్ సిస్టర్స్ సంస్థ సభ్యురాలైన బెకార్ట్, ప్యారిస్‌లోని ప్రఖ్యాత హెచ్‌ఈసీ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. బోస్టన్ యూనివర్సిటీలో కూడా ఆమె అధ్యయనం చేశారు. 2019 నుంచి సినాడ్‌కు కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సినాడ్ అండర్ సెక్రటరీగా ఎంపికైన తొలి మహిళ?
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : సిస్టర్ నథాలీ బెకార్ట్
ఎందుకు : చర్చికి సంబంధించిన విషయాల్లో సూక్ష్మపరిశీలన, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలకంగా మారాలన్న పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్ష మేరకు