సిల్వర్ లయన్ అవార్డీ, ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Sakshi Education
సిల్వర్ లయన్ అవార్డీ, ప్రముఖ సినీ దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా(77)కన్నుమూశారు.
కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన జూన్ 10న గుండెపోటుకుగురైకోల్‌కతాలోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు.1944లో పురూలియాలో జన్మించిన దాస్‌గుప్తా కళాశాలలో లెక్చరర్‌గా జీవితం ప్రారంభించారు. 1978లో తన మొట్టమొదటి సినిమా ‘దూరత్వ’తో కవి–గేయ రచయిత–దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. దాస్‌గుప్తా తన కెరీర్‌లో 12 జాతీయ అవార్డులు అందుకున్నారు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సిల్వర్ లయన్ అవార్డు, లొకార్నో క్రిటిక్స్ అవార్డు, లొకార్నో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సిల్వర్ లయన్ అవార్డీ, ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు :జూన్ 10
ఎవరు : బుద్ధదేవ్ దాస్‌గుప్తా(77)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు:కిడ్నీ సంబంధ సమస్యల కారణంగా...
క్విక్ రివ్యూ :
ఏమిటి : సిల్వర్ లయన్ అవార్డీ, ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు :జూన్ 10
ఎవరు : బుద్ధదేవ్ దాస్‌గుప్తా(77)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు:కిడ్నీ సంబంధ సమస్యల కారణంగా...
Published date : 11 Jun 2021 06:35PM