Skip to main content

శిల్పిగురు అవార్డు గ్రహీత న్యానేశ్వర్‌ కన్నుమూత

హస్తకళ కళాకారుడు, కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన కోవ న్యానేశ్వర్‌ (70) కన్ను మూశారు.
Current Affairs అనారోగ్యం కారణంగా ఆదిలాబాద్‌లో ఓ ఆస్పత్రిలో ఏప్రిల్‌ 21 తుదిశ్వాస విడిచారు. హస్తకళల్లో న్యానేశ్వర్‌ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2016, నవంబర్‌ 9న ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘శిల్పిగురు’ అవార్డును అందుకున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి...
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన సంప్రదాయ డోక్రీ లోహకళలో న్యానేశ్వర్‌ది అందెవేసిన చేయి. లోహకళలో ఆయన ప్రదర్శించే నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కేస్లాగూడకు వచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన గౌరవానికి చిహ్నంగా ఐటీడీఏ అధికారులు కేస్లాగూడ ఆశ్రమ పాఠశాలను అప్పట్లో న్యానేశ్వర్‌ లోహకళ తయారీ కేంద్రంగా మార్చారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : హస్తకళ కళాకారుడు, శిల్పిగురు అవార్డు గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : కోవ న్యానేశ్వర్‌ (70)
ఎక్కడ : ఆదిలాబాద్‌
ఎందుకు : అనారోగ్య సమస్యల కారణంగా...
Published date : 22 Apr 2021 07:40PM

Photo Stories