సీతమ్మ సాగర్ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం బ్యారేజీ
Sakshi Education
గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి ‘సీతమ్మసాగర్’గా నామకరణం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
ఈ మేరకు సాగునీటి శాఖ అధికారులకు ఫిబ్రవరి 14న సీఎం ఆదేశాలు జారీ చేశారు. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో దీని పేరును సీతమ్మ సాగర్‌గా పెట్టాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గోదావరిపై చేపట్టిన తుపాకులగూడెం పేరుకు సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీతమ్మ సాగర్ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం బ్యారేజీ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : తెలంగాణ

Published date : 15 Feb 2020 05:51PM