Skip to main content

సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగు అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన తుది పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి.
ఈ మేరకు కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ జనవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు మరియు 1,39,836 హెక్టార్ల స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ
ఎక్కడ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
Published date : 09 Jan 2019 05:24PM

Photo Stories