సీసీఎంబీ శాస్త్రవేత్తకు జేసీ బోస్ ఫెలోషిప్
Sakshi Education
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్‌కు ప్రతిష్టాత్మక జేసీ బోస్ ఫెలోషిప్ లభించింది.
జనాభా, వైద్యపరమైన జన్యుశాస్త్ర రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా తంగరాజ్‌ను భారత ప్రభుత్వం ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగపు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు అందించే ఈ ఫెలోషిప్ కింద తమ తమ రంగాల్లో విస్తృత పరిశోధనలకు రూ.15 లక్షల గ్రాంట్ లభిస్తుంది. దీంతోపాటు ప్రోత్సాహకంగా నెల కు రూ.25 వేలు చొప్పున ఐదేళ్లపాటు అందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్‌కు జేసీ బోస్ ఫెలోషిప్
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : జనాభా, వైద్యపరమైన జన్యుశాస్త్ర రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్‌కు జేసీ బోస్ ఫెలోషిప్
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : జనాభా, వైద్యపరమైన జన్యుశాస్త్ర రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా
Published date : 19 Aug 2019 05:24PM