సీఎస్‌ఐఆర్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న సంస్థ?
Sakshi Education
టాటా గ్రూపులో భాగమైన టాటా ఎండీ.. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)తో ఒప్పందం చేసుకుంది.
దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లను కరోనా పరీక్షలకు వినియోగించుకోవడం ఈ ఒప్పందంలో భాగంగా ఉండనుంది. చిన్న పట్టణాలు (ద్వితీయ, తృతీయ శ్రేణి), గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెంపునకు టాటాఎండీ పనిచేయనుంది. భవిష్యత్తులో కరోనా పరీక్షల అవసరాలు పెరిగితే తీర్చే విధంగా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. టాటాఎండీకి చెందిన ‘చెక్ సార్స్–కోవ్–2’ టెస్ట్ కిట్స్‌ను పరీక్షల కోసం విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ నుంచి విడుదలైన ప్రకటన తెలియజేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : టాటా గ్రూపులో భాగమైన టాటా ఎండీ
ఎందుకు : దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లను కరోనా పరీక్షలకు వినియోగించుకోవడం కోసం

Published date : 21 Jun 2021 07:44PM