సీఏపీఎఫ్ పదవీ విరమణ వయసు పెంపు
Sakshi Education
అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19న ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్త్ర సీమా బల్ అధికారులు ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నాలుగు బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి అధికారుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం 57 ఏళ్లుగా ఉంది.
అన్ని కేంద్ర బలగాలకూ ఒకే రిటైర్మెంట్ వయసు ఉండేట్లు చూడాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఏపీఎఫ్ పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

Published date : 20 Aug 2019 05:13PM