సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ తీర్మానం
Sakshi Education
పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలోనూ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని నిర్ణరుుంచింది.
ఏమిటి : పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని తీర్మానం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : తెలంగాణ రాష్ట్ర కేబినెట్
ప్రగతిభవన్‌లో ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు...
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు...
- పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహకం కోసం ఫిబ్రవరి 18న ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థారుు సదస్సు నిర్వహించాలి. వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరగాలి.
- పట్టణప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలి.
- జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్లు వెంటనే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి.
- పట్టణ ప్రగతిలో పచ్చదనం-పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి.
- తెలంగాణ లోకాయుక్త చట్టంపై తెచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించింది.
ఏమిటి : పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని తీర్మానం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : తెలంగాణ రాష్ట్ర కేబినెట్
Published date : 17 Feb 2020 06:05PM