Skip to main content

సీఏఏకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పుస్తకం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ‘నాగరికట్ట ఆతంకో’(పౌరసత్వ భయం) పేరుతో ఓ పుస్తకం రాశారు.
Current Affairsఈ పుస్తకాన్ని అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శనలో ఫిబ్రవరి 4న అమ్మకానికి ఉంచారు. ఈ పుస్తకంలో రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో భారత్‌లో అనిశ్చితి గురించి మమతా రాశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమం, తాజా రాజకీయాలపై తన అభిప్రాయాలను విశదీకరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీఏఏకు వ్యతిరేకంగా ‘నాగరికట్ట ఆతంకో’(పౌరసత్వ భయం) పేరుతో పుస్తకం
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ
Published date : 10 Feb 2020 05:56PM

Photo Stories