Skip to main content

సీఏఐటీ సమావేశంలో నిర్మలా సీతారామన్

అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) జనవరి 7న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.
Current Affairsపన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపుల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. జీఎస్‌టీ రిటర్నుల దాఖలును మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మై టైమ్ ఎట్ సెబీ పుస్తకం విడుదల
మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్, సెబీ మాజీ చైర్మన్ యు.కె. సిన్హా రచించిన ‘గోయింగ్ పబ్లిక్: మై టైమ్ ఎట్ సెబీ’ పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. నియంత్రణ సంస్థలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండాలని, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లపై ఆధారపడ కూడదని సిన్హా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక స్వాతంత్య్రం ప్రాథమిక అవసరమని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) సమావేశం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ

మాదిరి ప్రశ్నలు
Published date : 08 Jan 2020 05:42PM

Photo Stories