Skip to main content

సీబీడీటీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్(ఏసీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రమోద్ చంద్ర పదవీకాలం 2019, ఆగస్టు 31తో ముగియనుండగా.. మరో ఏడాది పాటు ఆయనను కొనసాగించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీబీడీటీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 30 Aug 2019 05:10PM

Photo Stories