Skip to main content

సీబీఐ చీఫ్‌గా అలోక్ వర్మ పునఃనియామకం

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) డెరైక్టర్‌గా అలోక్ కుమార్ వర్మను పునఃనియమిస్తూ సుప్రీంకోర్టు జనవరి 8న తీర్పు వెలువరించింది.
అయితే అలోక్‌వర్మ ఎలాంటి ప్రధాన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు ఆంక్షలు విధించింది. సీబీఐ చీఫ్‌ను నియమించేందుకు, తొలగించేందుకు అధికారం ఉన్న ప్రధాని నేతృత్వంలోని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీ అలోక్ వర్మ కేసును పరిశీలించి, ఆయనను సీబీఐ డెరైక్టర్ పదవిలో కొనసాగించాలా, వద్దా అన్నది నిర్ణయించేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కోర్టు పేర్కొంది.

సీబీఐ డెరైక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డెరైక్టర్ రాకేశ్ అస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో 2018, అక్టోబర్ 23న కేంద్రప్రభుత్వం వీరిద్దరినీ పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీబీఐ చీఫ్‌గా అలోక్ వర్మ పునఃనియామకం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 09 Jan 2019 05:26PM

Photo Stories