సీబీఐ అధికారి పెద్దిరాజుకు హోం ఎక్సలెన్స్ అవార్డు
Sakshi Education
సీబీఐ ప్రధాన కార్యాలయం సైబర్ నేరాల దర్యాప్తు విభాగంలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బండి పెద్దిరాజుకు కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు లభించింది.
కేసుల దర్యాప్తులో అత్యుత్తమంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన పెద్దిరాజు 1993లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరారు. ఇప్పటివరకు ఈయన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (2017), ఉత్తమ దర్యాప్తు అధికారి బంగారు పతకం (2008) , డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు (2014), రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు (2014, 2018), 144 నగదు రివార్డులు, 8 ప్రశంసాపత్రాలు పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : బండి పెద్దిరాజు
ఎందుకు : కేసుల దర్యాప్తులో అత్యుత్తమంగా విధులు నిర్వర్తించినందుకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : బండి పెద్దిరాజు
ఎందుకు : కేసుల దర్యాప్తులో అత్యుత్తమంగా విధులు నిర్వర్తించినందుకుగాను
Published date : 13 Aug 2019 05:28PM