సీఆర్‌పీఎఫ్ జవాను రాకేశ్వర్ సింగ్ విడుదల
Sakshi Education
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ దండకారణ్యంలో తమ వద్ద బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్ (కోబ్రా) జవాను రాకేశ్వర్ సింగ్ మన్హాన్‌ను మావోయిస్టులు ఏప్రిల్ 8న విడుదల చేశారు.
ఏప్రిల్ 3న బీజాపూర్ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చారు. ఇదే క్రమంలో కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్‌ను తమ బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే.
భారీ ప్రజా కోర్టు...
ఛత్తీస్‌గఢ్‌లోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ స్థాయిలో ప్రజాకోర్టు ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోనే జమ్మూకశ్మీర్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్‌ను తాళ్లు విప్పి విడుదల చేశారు. మధ్యవర్తులైన పద్మశ్రీ ధర్మపాల్ షైనీ, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెల్లం బోరయ్య, మరో ఏడుగురు జర్నలిస్టులకు అతన్ని అప్పగించారు.

Published date : 09 Apr 2021 06:17PM