Skip to main content

సీఐసీ ప్రధాన కమిషనర్‌గా సుధీర్ భార్గవ

కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన సమాచార కమిషనర్‌గా సుధీర్ భార్గవను నియమిస్తూ కేంద్రప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది.
భార్గవ ఇప్పటివరకు సీఐసీ సమాచార కమిషనర్‌గా పని చేశారు. అలాగే ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజా ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్ చంద్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాన సమాచార కమిషనర్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : సుధీర్ భార్గవ
Published date : 01 Jan 2019 06:02PM

Photo Stories