Skip to main content

షీ క్యాబ్స్ కార్యక్రమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?

మహిళలకు షీ క్యాబ్స్ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి కార్లను అందజేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా జనవరి 4న ప్రారంభమైంది.
Current Affairs
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి ఎంపికైన 18 మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి లెసైన్సులు ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్స్ ఆత్మరక్షణకు పెప్పర్ స్ప్రే, సెల్‌ఫోన్, జియో లొకేషన్ సౌకర్యం కల్పించారు. ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా దీనిని అమలు చేయనున్నారు.

ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు యంగ్ సైంటిస్ట్ అవార్డు
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డా. శిబ్ శంకర్ గంగూలీ ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ యంగ్ సైంటిస్టు ప్లాటినం జూబ్లీ అవారు’్డకు ఎంపికయ్యారు. భూగర్భశాస్త్ర, జియో ఫిజికల్ మెథడ్, ఆయిల్ ఫీల్డ్‌లో చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యూ
:
ఏమిటి : షీ క్యాబ్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు
ఎక్కడ : సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఎందుకు : మహిళలకు షీ క్యాబ్స్ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి
Published date : 05 Jan 2021 06:05PM

Photo Stories