Skip to main content

సిడ్బీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?

ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి సహకరించే విధంగా స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (సిడ్బీ)తో ఫిబ్రవరి 25న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Current Affairs
ఒప్పందం ప్రకారం... రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి పథకాల రూపకల్పన, మూలధనం సమకూర్చడం, వడ్డీ రాయితీలు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న సంస్థలను ఆదుకోవడానికి ప్రణాళికలు వంటి సేవలను సిడ్బీ అందిస్తుంది. అలాగే దేశ, విదేశాల్లో అమ్మకాల అవకాశాలను కల్పిస్తుంది. మూడేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : సిడ్బీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి కోసం
Published date : 26 Feb 2021 06:01PM

Photo Stories