Skip to main content

సిడ్బి నుంచి అత్యవసర రుణాలు

చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ. కోటి వరకు మూలధన రుణాలుగా అందిస్తున్నట్టు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) ఏప్రిల్ 7న ప్రకటించింది.
Current Affairsకరోనా వైరస్‌ కారణంగా అత్యవసర పరిస్థితులకు స్పందనగా 48 గంటల్లోనే ఈ రుణాన్ని అందిస్తామని, ఇందుకు ఎటువంటి తనఖా లేదా హామీ అవసరం లేదని సిడ్బి తెలిపింది. అలాగే, ఎంఎస్‌ఎంఈలకు రుణ సదుపాయాన్ని రూ.2 కోట్ల వరకు పెంచినట్టు పేర్కొంది.

భార‌త్ వృద్ధిరేటు 2 శాతమే: ఇక్రా
కరోనా ప్రభావంలో 2020–21లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2 శాతమే ఉంటుందని ఇక్రా రేటింగ్స్‌ అంచనావేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్‌ జీడీపీలో వృద్ధిలేకపోగా 4.5 శాతం క్షీణత నమోదయ్యే వీలుంది. అయితే క్రమంగా కోలుకుని 2020–21లో 2 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చు’’ అని పేర్కొంది.

కేంద్రానికి అదనంగా రూ.5 లక్షల కోట్లు కావాలి
కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలకు సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 2–2.5 శాతం లేదా రూ.4–5 లక్షల కోట్ల మేర అదనంగా రుణాలు సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మార్కెట్‌ నుంచి కాకుండా ఆర్‌బీఐ నుంచి నేరుగా రుణాల రూపంలో తీసుకోవాలని, ఇందుకోసం ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం)ను సవరించాలని గార్గ్‌ సూచించారు.
Published date : 08 Apr 2020 04:59PM

Photo Stories