Skip to main content

షి జిన్‌పింగ్‌కు కిర్గిజ్ అత్యున్నత పురస్కారం

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘మనాస్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ’ లభించింది.
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13న జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్ ఈ అవార్డు ప్రదానం చేశారు. కి ర్గిస్థాన్-చైనా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య అభివృద్ధికి జిన్‌పింగ్ అందించిన ప్రత్యేక సేవలను ఈ సందర్బంగా సూరోన్‌బే ప్రశంసించారు. జిన్‌పింగ్ మాట్లాడుతూ, చైనా ప్రజలకు, కిర్గిజ్ ప్రజలకు మధ్య వున్న ప్రగాఢ మైత్రిని ఈ అవార్డు ప్రతిబింబిస్తుందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కిర్గిస్థాన్ మనాస్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ పురస్కారం
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్
ఎక్కడ : బిష్కెక్, కిర్గిస్థాన్
Published date : 14 Jun 2019 05:39PM

Photo Stories