Skip to main content

సహ-రుణ పథకాన్ని ప్రకటించిన రిజ‌ర్వ్ బ్యాంక్

ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని రుణాలు అందించే దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నవంబర్ 5 ఒక కీలక విధానాన్ని ప్రకటించింది.
Current Affairs
బ్యాంకులు-బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కలిసి ఆయా రంగాలకు రుణ లభ్యత కల్పించడానికి వీలుగా కో-లెండింగ్ నమూనా (సీఎల్‌ఎం) పథకాన్ని ఆవిష్కరించింది. సహ-రుణాలను అందించడానికి ఆయా బ్యాంకులు-ఎన్‌బీఎఫ్‌సీ మధ్య ఒక ముందస్తు అవగాహన ఉండాలి. రుణాలకు సంబంధించి లాభ-నష్టాలను వాటి వాటి వాటాల ఆధారంగా బ్యాంకులు-ఎన్‌బీఎఫ్‌సీ పంచుకుంటాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కో-లెండింగ్ నమూనా (సీఎల్‌ఎం) పథకం ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : బ్యాంకులు-బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కలిసి ఆయా రంగాలకు రుణ లభ్యత కల్పించడానికి వీలుగా
Published date : 09 Nov 2020 06:03PM

Photo Stories