Skip to main content

సగటు జీతాల గ్లోబల్ లిస్ట్‌లో భారత్‌కు 72 ర్యాంకు

ప్రపంచవ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్ లో భారత్ 72వ స్థానంలో నిలిచింది.
Current Affairsతాజాగా 106 దేశాల్లో సగటు నెలవారీ జీతాలు, వేతనాలు ఎలా ఉన్నాయన్న దానిపై అంతర్జాతీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం పికొడి.కామ్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. స్విట్జర్లాండ్ రూ.4.49 లక్షల (5,989 యూఎస్ డాలర్లు) సగటు జీతంతో ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్

ర్యాంకు

దేశం

అంకెలు( అమెరికా డాలర్లలో..)

1

స్విట్జర్లాండ్

5,989

2

లగ్జెంబర్గ్

4,014

3

అమెరికా

3,534

4

డెన్మార్క్

3,515

5

సింగపూర్

3,414

6

ఆస్ట్రేలియా

3,333

7

ఖతార్

3,232

8

నార్వే

3,174

9

హాంకాంగ్

3,024

10

ఐస్‌లాండ్

2,644

72

భారత్

437

106

క్యూబా

36


ఆసియాలో దక్షిణ కొరియా...
ఆసియాలోని దేశాల్లో దక్షిణ కొరియా రూ.1,72,900 సగటు నెలసరి ఆదాయంతో ఉన్నత స్థానంలో ఉండగా, చైనా రూ.72,100, మలేసియా రూ.62,700, థాయ్‌లాండ్ రూ.46,400 ఆ తర్వాత ర్యాంకుల్లో నిలిచాయి. ఇక వియత్నాం రూ.30,200, ఫిలిప్పీన్స్ రూ.23,100, ఇండోనేసియా రూ.22,900, పాకిస్తాన్ రూ.15,700 నెలసరి సగటు జీతాలు, వేతనాలతో అథమస్థానాల్లో నిలిచాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్ లో భారత్‌కు 72వ ర్యాంకు
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : అంతర్జాతీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం పికొడి.కామ్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
Published date : 01 Sep 2020 06:26PM

Photo Stories