సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
Sakshi Education
దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా జనవరి 1న సోమ మండల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆమె ఇదే కంపెనీలో డెరైక్టర్‌గా పనిచేశారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కెలా నుంచి 1984లో పట్టభద్రురాలైన సోమ నాల్కో సంస్థలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నాల్కో డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 2017లో సెయిల్ కంపెనీలో చేరారు. డిసెంబర్ 31న తాజాగా పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరీ స్థానంలో సోమ మండల్ బాధ్యతలు చేపట్టారు.
కోవిడ్-19 వ్యాక్సిన్లు స్వేచ్ఛగా ఎగుమతి, దిగుమతి
విలువ పరిమితి లేకుండా కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండెరైక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) ఈ మేరకు నిబంధనలను సవరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : సోమ మండల్
Published date : 02 Jan 2021 05:48PM