సెరావీక్ సదస్సులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర
Sakshi Education
న్యూఢిల్లీలో అక్టోబర్ 14న జరిగిన భారత ఇంధన ఫోరమ్ ‘సెరావీక్’ సదస్సులో కేంద్ర పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 2023 నాటికి ఆయిల్, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి విభాగంలోకి 58 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. అలాగే, 2024 నాటికి సహజ వాయువు మౌలిక సదుపాయాలైన పైపులైన్లు, దిగుమతి టర్మినళ్లు, పట్టణ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లోకి మరో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఈ సదస్సుకు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ హాజర య్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఇంధన ఫోరమ్ ‘సెరావీక్’ సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఇంధన ఫోరమ్ ‘సెరావీక్’ సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 15 Oct 2019 06:47PM