సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ క్షీణ రేటు?
Sakshi Education
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-2021) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమైంది.
జాతీయ గణాంకాల కార్యాలయం నవంబర్ 27న ఈ విషయాన్ని తెలిపింది. కఠిన లాక్‌డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం(2019-2020) ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది.
క్షీణత ఇలా...:
జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం... 2020-21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019-20 ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయి్యందన్నమాట.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020-2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం

Published date : 28 Nov 2020 06:01PM