సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతి
Sakshi Education
నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం ఉద్దేశించిన ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’’కు భారత సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ. పరిధిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకి 2-1 ఓట్ల తేడాతో జనవరి 5న సుప్రీంకోర్టు బెంచ్ ఆమోద ముద్ర వేసింది. ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించి కేంద్రం చేసిన వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలు ఏకీభవించగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యతిరేకించారు. కాలుష్య నియంత్రణ కోసం స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని, యాంటీ స్మాగ్ గన్స్ ఉపయోగించాలని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
చదవండి: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాల ఆర్కిటెక్చర్‌ను రూపొందించిన సంస్థ?
Published date : 06 Jan 2021 05:47PM