Skip to main content

సేవా కార్యక్రమాలకు కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ

కార్పొరేట్ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ-సీఎస్సార్) కింద రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం, వాటిని పక్కాగా పర్యవేక్షించడానికి ‘కనెక్ట్ టు ఆంధ్ర’ అనే లాభాపేక్షలేని సొసైటీని ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది.
Edu news
 
 ఉద్దేశం..
 సీఎస్సార్ కింద నిధులు సమీకరించి నిర్మాణాత్మకంగా విద్య, వైద్య రంగాల్లో వెచ్చించడం ద్వారా మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేయడం కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ ఉద్దేశం. నిబంధనల ప్రకారం... ప్రతి సంస్థ ఏటా వచ్చే నికర లాభంలో రెండు శాతం మొత్తాన్ని తప్పనిసరిగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి.
 
 సీఈఓగా ప్రణాళిక విభాగం కార్యదర్శి..
 కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ప్రణాళిక విభాగం కింద ఉప కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి హోదా అధికారి ఉంటారు.
 
 సీఎం అధ్యక్షతన కార్యనిర్వాహక కమిటీ..

 ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్ కమ్ కార్యనిర్వాహక కమిటీ ఉంటుంది. ఇందులో ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ప్రణాళిక శాఖ కార్యదర్శి మెంబర్ కన్వీనరుగా వ్యవహరిస్తారు. విధాన నిర్ణయాల రూపకల్పన, సామాజిక బాధ్యతల్లో కార్పొరేట్ సేవలను వినియోగించుకోవడం ఈ కమిటీ బాధ్యతలు. అలాగే జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
సేవా కార్యక్రమాలకు కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ
 ఎప్పుడు : డిసెంబర్ 31
 ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
 ఎందుకు : రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం, వాటిని పక్కాగా పర్యవేక్షించడానికి
 
 మాదిరి ప్రశ్నలు

1. నిబంధనల ప్రకారం.. ప్రతి సంస్థ ఏటా వచ్చే నికర లాభంలో ఎంత శాతం మొత్తాన్ని తప్పనిసరిగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి.
1. నాలుగు
2. ఐదు
 3. రెండు
4. ఎనిమిది
Published date : 01 Jan 2020 07:08PM

Photo Stories