సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తోన్న రాష్ట్రం?
Sakshi Education
సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోంది.
2021, మార్చి 4వ తేదీన తిరుపతిలో ఈ సమావేశాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి (ప్రస్తుతం సీఎం లేరు) నుంచి ముఖ్యమంత్రులు.. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ప్రధానంగా 26 అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి సమావేశంలో చర్చించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, మార్చి 4న సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశానికి ఆతిథ్యం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎక్కడ : తిరుపతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి చర్చించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, మార్చి 4న సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశానికి ఆతిథ్యం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎక్కడ : తిరుపతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి చర్చించేందుకు
Published date : 26 Feb 2021 05:57PM