సచిన్ టెండూల్కర్‌కు లారియస్ పురస్కారం
Sakshi Education
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ప్రతిష్ఠాత్మక ‘లారియస్ బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్’ అవార్డు లభించింది.
2011 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం అనంతరం సచిన్‌ను భారత జట్టు సభ్యులందరూ తమ భుజాలపై మోసి మైదానంలో(క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్) కలియతిరిగారు. ఇప్పుడు ఆ సందర్భమే గత 20 ఏళ్లలో ‘అత్యుత్తమ లారియస్ స్పోర్టింగ్ మూమెంట్’గా ఎంపికైంది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఫిబ్రవరి 18న(భారత కాలమానం ప్రకారం) జరిగిన కార్యక్రమంలో సచిన్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, మాజీ టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్ ఈ అవార్డును ప్రదానం చేశారు. రెండు దశాబ్దాల ‘లారియస్ క్రీడా పురస్కారాల చరిత్ర’లో భారత్ లేదా భారత క్రీడాకారుడు ఒక అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి.
ప్రపంచ వ్యాప్తంగా ఓటింగ్‌తో...
గత ఇరవై ఏళ్లలో (2000-2020) క్రీడా ప్రపంచంలో నెలకొన్న ఇరవై అత్యుత్తమ క్రీడా ఘట్టాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 2011 వన్డే ప్రపంచకప్‌లో సహచర ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై మోసిన ఫొటో (క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్)కే అత్యధిక ఓట్లు లభించాయి. ఈ అవార్డుకు సాధారణ మ్యాచ్‌ల ఫలితాలు, స్కోర్లు తదితర అంశాలతో సంబంధం లేకుండా ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన ఘట్టాలనే ఎంపిక చేసి నామినేట్ చేశారు.
లారియస్ ఇతర అవార్డుల విజేతల వివరాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : లారియస్ బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్ పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : సచిన్ టెండూల్కర్
ఎక్కడ : బెర్లిన్, జర్మనీ

- స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్: లూయిస్ హామిల్టన్ (ఫార్ములావన్-బ్రిటన్), లయోనల్ మెస్సీ (ఫుట్‌బాల్-అర్జెంటీనా)
- స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్: సిమోన్ బైల్స్ (జిమ్నాస్టిక్స్-అమెరికా)
- వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్: దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు
- వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్: ఎగాన్ బెర్నాల్ (సైక్లింగ్-కొలంబియా)
- వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్: సోఫియా ఫ్లోర్‌ష్ (రేసింగ్-జర్మనీ)
- స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ డిస్‌ఎబిలిటీ: ఒక్సానా మాస్టర్స్ (పారా రోయింగ్-అమెరికా)
- యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్: కోయి కిమ్ (స్నో బోర్డింగ్-అమెరికా)
- స్పోర్ట్ ఫర్ గుడ్: సౌత్ బ్రాంక్స్ యునెటైడ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్: డర్క్ నొవిట్జీ (బాస్కెట్‌బాల్-జర్మనీ)
- అకాడమీ ఎక్సెప్షనల్ అచీవ్‌మెంట్: స్పానిష్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : లారియస్ బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్ పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : సచిన్ టెండూల్కర్
ఎక్కడ : బెర్లిన్, జర్మనీ
Published date : 19 Feb 2020 05:59PM