శౌర్యచక్ర అవార్డులు-2020
Sakshi Education
2020 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా నలుగులు శౌర్యచక్ర అవార్డులకు ఎంపికయ్యారు.
ఈ మేరకు రక్షణ బలగాలకు ఇచ్చే వివిధ గ్యాలెంటరీ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ ఏడాది శౌర్యచక్ర పురస్కారానికి ముగ్గురు ఆర్మీ నుంచి, ఒకరు వైమానికదళం నుంచి ఎంపికయ్యారని రక్షణ శాఖ ఆగస్టు 14న తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న లెఫ్టినెంట్ కల్నల్ క్రిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవల్దార్ అలోక్ కుమార్ దూబే ఆర్మీ నుంచి, ఎయిర్‌ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ విశాక్ నాయర్ శౌర్యచక్రకు ఎంపికయ్యారు.
19 మందికి ఎంఐడీ గౌరవం...
శౌర్యచక్రకు ఎంపికైన వారితో పాటు... 60 మంది ఆర్మీ ఆఫీసర్లకు సేనా మెడల్స్, నలుగురు నేవీ అధికారులకు నవో సేనా మెడల్స్, ఐదుగురు ఎయిర్‌ఫోర్స్ అధికారులకు వాయు సేనా మెడల్స్‌కు ఎంపికయ్యారు. మరో 19 మంది ఆర్మీ అధికారులకు మెన్షన్ ఇన్ డిస్పాచ్(ఎంఐడీ) గౌరవం దక్కనుంది. ఇందులో 8 మంది మరణానంతరం ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శౌర్యచక్ర అవార్డులు-2020కి ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు :లెఫ్టినెంట్ కల్నల్ క్రిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవల్దార్ అలోక్ కుమార్ దూబే, వింగ్ కమాండర్ విశాక్ నాయర్

Published date : 15 Aug 2020 10:29PM