సౌరభ్ వర్మకు హైదరాబాద్ ఓపెన్ టైటిల్
Sakshi Education
జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మకు హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-100 టోర్నమెంట్‌లో టైటిల్ లభించింది.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 11న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 26 ఏళ్ల సౌరభ్(మధ్యప్రదేశ్) 21-13, 14-21, 21-16తో లో కీన్ యె (సింగపూర్)పై విజయం సాధించాడు.విజేతగా నిలిచిన సౌరభ్కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
మరోవైపు మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి-అశ్విని 17-21, 17-21తో హా బేక్- జుంగ్ యుంగ్ (కొరియా) చేతిలో ఓడారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-100 టోర్నమెంట్‌లో టైటిల్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : సౌరభ్ వర్మ
ఎక్కడ : గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం, హైదరాబాద్

Published date : 12 Aug 2019 05:43PM