సౌర గ్రహానికి పండిత్ జస్‌రాజ్ పేరు
Sakshi Education
సౌర కుటుంబంలోని అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రహానికి సుప్రసిద్ధ శాస్త్రీయ గాయకుడు, పద్మవిభూషణ్ గ్రహీత పండిత్ జస్‌రాజ్(89) పేరును పెట్టారు.
ఖగోళశాస్త్రానికి సంబంధించిన అంతర్జాతీయ సమితి ఈ గ్రహానికి ‘పండిత్ జస్‌రాజ్’ అని నామకరణం చేసినట్లు జస్‌రాజ్ కుమార్తె దుర్గా జస్‌రాజ్ సెప్టెంబర్ 29న వెల్లడించారు. ఓ భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడి పేరును పెట్టడం ఇదే తొలిసారి. 2006లో ఈ గ్రహాన్ని కనుగొన్నారు.
Published date : 30 Sep 2019 05:54PM