సౌదీ, యూఏఈ పర్యటనకు పెట్రోలియం మంత్రి
Sakshi Education
పెట్రోలియం ఎగుమతిదేశాల సంఘం (ఒపెక్)లో కీలక పాత్ర పోషిస్తున్న సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), కతర్ దేశాల్లో భారత్ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించనున్నారు.
చమురు ప్రధాన ఉత్పాదక దేశాలతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకూ మంత్రి ఆయా దేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 10వ తేదీన అబూధబీలో ఇంధనంపై జరిగే 8వ ఆసియన్ మంత్రిత్వస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ సమావేశానికి యూఏఈతో కలిసి భారత్ కూడా ఆతిథ్య దేశంగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సౌదీ, యూఏఈ పర్యటనకు పెట్రోలియం మంత్రి
ఎప్పుడు : సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకూ
ఎవరు : ధర్మేంద్ర ప్రధాన్
ఎందుకు : చమురు ప్రధాన ఉత్పాదక దేశాలతో సహకారాన్ని మరింత పెంపొందించుకోనేందుకు

Published date : 07 Sep 2019 05:25PM