Skip to main content

సౌదీ రాజు సల్మాన్‌తో ప్రధాని మోదీ భేటీ

సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో అక్టోబర్ 29న జరిగిన ఈ సమావేశంలో ఆయిల్ అండ్ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సహించరాదని సల్మాన్-మోదీ తీర్మానించారు. ఈ సందర్భంగా భారత్-సౌదీ మధ్య స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్ ఒప్పందం జరిగింది. అలాగే సౌదీ అరేబియాలో రూపే కార్డు ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

మరోవైపు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు రెండో అబ్దుల్లాతోనూ మోదీ సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరు సహా భద్రతకు సంబంధించిన అంశాల్లో భారత్, సౌదీ అరేబియాల మధ్య సహకారం విజయవంతంగా ముందుకు సాగుతోందని స్థానిక పత్రిక ‘అరబ్ న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు.
 
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్‌తో భేటీ
ఎప్పుడు : అక్టోబర్‌ 29
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా
ఎందుకు : ఆయిల్‌ అండ్‌ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారంపై చర్చలు జరిపేందుకు

 

 
Published date : 30 Oct 2019 05:40PM

Photo Stories