సావరిన్ గోల్డ్ బాండ్ ధర స్థిరీకరణ
Sakshi Education
సావరిన్ గోల్డ్ బాండ్స్ 2019-2020 (సిరీస్ 3) జారీ ధరను కేంద్రం గ్రాముకు రూ.3,499గా స్థిరీకరించింది.
ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు 2న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం బాండ్లకు చందా చెల్లింపు ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. సెటిల్‌మెంట్ తేదీ ఆగస్టు 14 అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్ పద్దతిలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో బంగారానికి (ఫిజికల్‌గా) డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది.
Published date : 03 Aug 2019 05:32PM