షాట్‌పుట్‌లో తజీందర్ జాతీయ రికార్డు
Sakshi Education
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తజీందర్ పాల్ సింగ్ తూర్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో అక్టోబర్ 12న జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో తజీందర్ ఇనుప గుండును 20.92 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. 20.75 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఇటీవల ఖతర్ రాజధాని దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తజీందర్ 20.43 మీటర్లతో 18వ స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో జాతీయ రికార్డు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : తజీందర్ పాల్ సింగ్ తూర్
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో జాతీయ రికార్డు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : తజీందర్ పాల్ సింగ్ తూర్
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
Published date : 14 Oct 2019 05:46PM