Skip to main content

శాటిలైట్ ఆధారిత ఐవోటీ సేవలను ఆవిష్కరించిన తొలి సంస్థ?

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) తాజాగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఐవోటీ) డివైజ్ సేవలను డిసెంబర్ 10న ఆవిష్కరించింది.
Current Affairs
మొబైల్ టవర్లు లేని ప్రాంతాలతో పాటు భారతదేశ పరిధిలోని సముద్రాల్లో కూడా ఈ సర్వీసులు అందుకోవచ్చు. ఈ తరహా నెట్‌వర్క్‌లో ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిదని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ సీఎండీ పి.కె. పుర్వార్ తెలిపారు.

స్కెలోతో భాగస్వామ్యం...
అమెరికాకు చెందిన స్కైలో సంస్థ భాగస్వామ్యంతో ఐవోటీ డివైజ్ సేవలను రూపొందించారు. దీనికోసం ప్రత్యేకంగా భారత మార్కెట్లో వినియోగానికి స్కైలో సంస్థ డివైజ్ రూపొందించింది. దీని ధర సుమారు రూ. 10,000 ఉంటుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : శాటిలైట్ ఆధారిత ఐవోటీ సేవలను ఆవిష్కరించిన తొలి సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)
ఎక్కడ : ప్రపంచంలోనే
Published date : 11 Dec 2020 05:49PM

Photo Stories