Skip to main content

శాసనమండలి ప్రొటెమ్‌ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్సీ?

తెలంగాణ శాసనమండలి ప్రొటెమ్‌ చైర్మన్‌గా ఎమ్మెల్సీ వి. భూపాల్‌రెడ్డినియమితులయ్యారు.
Current Affairsఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి. నరసింహాచార్యులు జూన్ 3న ఉత్తర్వులు జారీ చేశారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం ఏకకాలంలో జూన్ 3న పూర్తి అయిన నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. మండలికి కొత్త చైర్మన్‌ను సభ్యులు ఎన్నుకొనే వరకు ఈ నియామకం అమల్లో ఉండనుంది. ప్రొటెమ్‌ చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి జూన్ 4న బాధ్యతలు స్వీకరించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన వెన్నవరంభూపాల్‌రెడ్డి1967 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసి 2014 జూన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల కోటాలో వరుసగా మూడోసారి మండలికి ఎన్నికయ్యారు. 2007, 2009లో కాంగ్రెస్‌ తరఫున మండలికి ఎన్నికైన భూపాల్‌రెడ్డి2015లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు.

ఆరుగురికి వీడ్కోలు..
ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన మండలి చైర్మన్‌ గుత్తా, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం జూన్ 3న ము గిసింది. జూన్‌ 3లోగా ఖాళీ అయిన స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ శాసనమండలి ప్రొటెమ్‌ చైర్మన్‌గానియమితులైన ఎమ్మెల్సీ?
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : వి. భూపాల్‌రెడ్డి
ఎందుకు :మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం ఏకకాలంలో జూన్ 3న పూర్తి అయిన నేపథ్యంలో
Published date : 05 Jun 2021 12:54PM

Photo Stories