సార్స్‌ను దాటేసిన కరోనా మరణాలు
Sakshi Education
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. 26 దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. ఒక్క చైనాలోనే ఫిబ్రవరి 8వ తేదీ నాటికి 813 మందిని బలికొన్నది.
ఈ వైరస్ సోకి, చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఫిబ్రవరి 8వ తేదీ నాటికి 37వేలు దాటింది. ఈ గణాంకాలు కరోనా కల్లోలాన్ని కళ్లకు కడుతున్నాయి. 2002-03లో ప్రపంచాన్ని వణికించిన ‘సార్స్’ వైరస్‌ను మించిన ప్రమాదకారిగా ఈ కరోనా పరిణమించింది. నాడు ‘సార్స్’ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 774 కాగా, ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 800 దాటింది. కరోనా తరహాలోనే సార్స్ వైరస్‌ను కూడా మొదట చైనాలోనే గుర్తించారు. ఈ రెండు కూడా ఒకే వైరల్ కుటుంబానికి చెందినవే.
భారత్ స్నేహ హస్తం
కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమవుతున్న చైనాకు భారత్ స్నేహ హస్తం అందించింది. కరోనా కట్టడికి అవసరమైన ఏ సాయమైనా చేసేందుకు సిద్ధమని తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఫిబ్రవరి 9న లేఖ రాశారు. చైనాలోని భారతీయుల ఆరోగ్యం, భద్రత విషయంలో భారత్‌తో సమన్వయం చేసుకునేందుకు, కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్ సాయం తీసుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు.

Published date : 10 Feb 2020 05:54PM