‘శారద’ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి
Sakshi Education
న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తునకు పశ్చిమ బెంగాల్ అధికారులు సహకరించడం లేదంటూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్ విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు ప్రకటించారు.
ఈ కేసుపై విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. ఫిబ్రవరి 20న వాదనలు వినాల్సి ఉంది. అయితే జస్టిస్ నాగేశ్వరరావు విముఖత వ్యక్తం చేయడంతో కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ కేసు ఈ ఫిబ్రవరి 27కు వాయిదా పడింది. గతంలో బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించానని.. అందువల్ల ఈ కేసు విచారణను తాను చేపట్టలేనని నాగేశ్వరరావు తెలిపారు. మరోవైపు బెంగాల్ అధికారులు మలయ్ కుమార్ దే, వీరేంద్ర కుమార్, రాజీవ్ కుమార్ ఈ విషయంపై క్షమాపణలు తెలియజేస్తూ.. కోర్టులో ఫిబ్రవరి 18న ప్రమాణ పత్రం దాఖలు చేయడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘శారద’ కుంభకోణం దర్యాప్తు నుంచి వైదొలిగిన న్యాయమూర్తి
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎవరు : జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘శారద’ కుంభకోణం దర్యాప్తు నుంచి వైదొలిగిన న్యాయమూర్తి
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎవరు : జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు
Published date : 21 Feb 2019 06:11PM