శాక్సాఫోన్ విద్వాంసుడు గోపాల్‌నాథ్ అస్తమయం
Sakshi Education
ప్రముఖ శాక్సాఫోన్ సంగీత విద్యాంసుడు, పద్మశ్రీ కదిరి గోపాల్‌నాథ్ (69) కన్నుమూశారు.
ఈయన సంగీతంలో శాక్సా ఫోన్‌తో అనేక అద్భుతాలు ఆవిష్కరించారు. భారత్‌లోనే కాకుండా అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పశ్చిమాసియా దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో కచేరీ చేసిన అతికొద్దిమంది కర్ణాటక సంగీత విద్యాంసుల్లో ఈయనొకరు. ఈయన కృషికి గాను మంగళూరు, బెంగళూరు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: శాక్సాఫోన్ విద్వాంసుడు గోపాల్‌నాథ్ అస్తమయం
ఎవరు: కదిరి గోపాల్‌నాథ్
ఎక్కడ: కర్ణాటకలోని మంగళూరు
క్విక్ రివ్యూ:
ఏమిటి: శాక్సాఫోన్ విద్వాంసుడు గోపాల్‌నాథ్ అస్తమయం
ఎవరు: కదిరి గోపాల్‌నాథ్
ఎక్కడ: కర్ణాటకలోని మంగళూరు
Published date : 12 Oct 2019 04:47PM