Skip to main content

సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్న రచయిత్రి?

2019 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి అందుకున్నారు.
Current Affairsమార్చి 13న ఢిల్లీలో జరిగిన అనువాద పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబారా చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ.50వేల నగదును అందజేశారు.
 
ఒక హిజ్రా ఆత్మకథకు...
ఎ.రేవతి ఆంగ్ల రచన ‘ద ట్రూత్‌ అబౌట్‌ మి: ఏ హిజ్రా లైఫ్‌ స్టోరీ (ఆటోబయోగ్రఫీ)’ని ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా సత్యవతి తెలుగులోకి అనువదించారు. ఈ అనువాద పుస్తకాన్ని అకాడమీ అవార్డుకు ఎంపికచేశారు.

పదో తరగతిలో పాఠ్యాంశంగా...
గుంటూరు జిల్లా కొలుకలూరులో 1938లో జన్మించిన సత్యవతి ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. 1970 లో సాహిత్యరంగంలో ప్రవేశించి ఇప్పటివరకు అనేక రచనలు చేశారు. ఇల్లలకగానే, మంత్రనగరి, సత్యవతి కథలు 2, రాగం భూపాళం సహా పలు రచనలు, అనువాదాలు చేశారు. సత్యవతి రాసిన ‘వాటిజ్‌ మై నేమ్‌’ కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా.. ‘విల్‌ హీ కమ్‌ హోం’ కథ ఇంటర్‌లో పాఠ్యాంశంగా ఉన్నాయి.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 2019 ఏడాది సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్న రచయిత్రి?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఎ.రేవతి ఆంగ్ల రచన ‘ద ట్రూత్‌ అబౌట్‌ మి: ఏ హిజ్రా లైఫ్‌ స్టోరీ (ఆటోబయోగ్రఫీ)’ని ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా తెలుగులోకి అనువదించినందుకు
Published date : 15 Mar 2021 06:01PM

Photo Stories