రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి రాజీనామా
Sakshi Education
తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమబెంగాల్ రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి నవంబర్ 27న తన పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి ఫ్యాక్స్ చేసిన ఆయన, అదే విషయాన్ని గవర్నర్‌కు ఈమెయిల్ ద్వారా వెల్లడించారు. అలాగే హల్దియా డెవలప్‌మెంట్ అథార్టీ చైర్మన్ పదవి, హుగ్లీ రివర్ బ్రిడ్‌జ కమిషనర్స్ చైర్మన్ పదవికి కూడా సువేందు రాజీనామా చేశారు. తనకు కల్పించిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తిప్పిపంపారు.
పశ్చిమ బెంగాల్....
రాజధాని: కోల్‌కతా;
ప్రస్తుత గవర్నర్: జగ్‌దీప్ ధన్‌కర్;
ప్రస్తుత ముఖ్యమంత్రి: మమతా బెనర్జీ;
హైకోర్టు: కలకత్తా హైకోర్టు;
కలకత్తా హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్;
Published date : 28 Nov 2020 06:00PM