రుతుపవనాల సూచన తేదీల మార్పు : ఐఎండీ
Sakshi Education
మారుతున్న వర్షపాతం విధానంతో రుతుపవనాల సూచనల తేదీలలో మార్పులుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
2020 ఏడాది నుంచి నైరుతి రుతుపవనాల సూచన తేదీలను ఉపసంహరించుకున్నట్లు ఎర్త్‌సైన్‌స మంత్రిత్వ శాఖ జనవరి 16న వెల్లడించింది. రుతుపవనాల సూచనల తేదీల మార్పు పంటలు సాగు చేసేందుకు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంది. కేరళ మీదుగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికే వస్తాయని, అరుుతే మిగతా రాష్ట్రాలు, నగరాల్లో ఈ తేదీలో మార్పులుంటాయని తెలిపింది.
ప్రస్తుతం ఐఎండీ అనుసరిస్తున్న విధానంలో.. నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్ ఏటా జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. 1940లలో ఈ తేదీలను ఖరారుచేశారు. ప్రస్తుత తీరుతెన్నులకు అనుగుణంగా దీన్ని మార్చనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రుతుపవనాల సూచన తేదీల మార్పు
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఎర్త్‌సైన్‌స మంత్రిత్వ శాఖ
ఎక్కడ : దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో
ఎందుకు : మారుతున్న వర్షపాతం విధానం కారణంగా
మాదిరి ప్రశ్నలు
ప్రస్తుతం ఐఎండీ అనుసరిస్తున్న విధానంలో.. నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్ ఏటా జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. 1940లలో ఈ తేదీలను ఖరారుచేశారు. ప్రస్తుత తీరుతెన్నులకు అనుగుణంగా దీన్ని మార్చనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రుతుపవనాల సూచన తేదీల మార్పు
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఎర్త్‌సైన్‌స మంత్రిత్వ శాఖ
ఎక్కడ : దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో
ఎందుకు : మారుతున్న వర్షపాతం విధానం కారణంగా
మాదిరి ప్రశ్నలు
1. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డెరైక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
1. డాక్టర్ మృత్యుంజయ్ మోహపాత్రా
2. డాక్టర్ హర్షవర్ధన్
3. డాక్టర్ సందర్శిని వెంకటరామన్
4. డాక్టర్ వినీత్ శంకర్
- View Answer
- సమాధానం: 1
2. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
1. హైదరాబాద్
2. న్యూఢిల్లీ
3. కోల్‌కతా
4. సూరత్
- View Answer
- సమాధానం: 2
Published date : 17 Jan 2020 06:04PM