Skip to main content

రూప్‌కుండ్‌లో భారతీయుల అస్థిపంజరాలు

రూప్‌కుండ్ సరస్సు వద్ద లభించిన అస్థిపంజరాలు భారతీయ, ఆగ్నేయాసియా, గ్రీకు లాంటి మధ్యధరా ప్రాంత ప్రజలకు చెందినవని సీసీఎంబీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
ఈ పరిశోధన వివరాలను సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా, పరిశోధనకు నేతృత్వం వహించిన సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ ఆగస్టు 20న వెల్లడించారు. అందుబాటులో ఉన్న రుజువులను బట్టి చూస్తే వీరు నందాదేవి దర్శనానికి వెళుతున్న వారు గానీ, వ్యాపారులుగానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తంగరాజ్ చెప్పారు. నేచర్ కమ్యూనికేషన్‌‌స సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.

ఇదీ నేపథ్యం...
1956లో భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు కొందరు హిమాలయాల్లో సముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున ఉన్న 500 అస్తిపంజరాలు ఉండటాన్ని తొలిసారి గుర్తించారు. వీరు ఎవరు? ఎక్కడి వారు? సరస్సు వద్ద ఎందుకు మరణించారు? అన్న విషయాలు మాత్రం తెలియలేదు. దీంతో ఈ అస్థిపంజరాల మిస్టరీని ఛేదించేందుకు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) 2005లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీఎంబీ మాజీ డెరైక్టర్ డాక్టర్ లాల్జీసింగ్, డాక్టర్ తంగరాజ్‌లు పరిశోధనలు ప్రారంభించారు. లాల్జీసింగ్ ఇటీవలే మరణించగా, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సహకారంతో తంగరాజ్ ఈ పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: రూప్‌కుండ్‌లో భారతీయుల అస్థిపంజరాలు
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)
Published date : 21 Aug 2019 06:24PM

Photo Stories