Skip to main content

రుగ్మతగా ఆన్‌లైన్ షాపింగ్ : గార్టనర్

ఆన్‌లైన్ షాపింగ్‌ను ఒక వ్యసనపరమైన రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్టనర్ వెల్లడించింది.
కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఎడాపెడా కొనేసే అలవాటు వల్ల ఒత్తిడికీ, మానసిక ఆందోళనకు గురవుతారని డబ్ల్యూహెచ్‌వో గుర్తించినట్టు పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్‌ని దుర్వినియోగం చేసుకోవడం కారణంగా లక్షలాది మంది ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని, ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వినియోగదారులు చేసే వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోందని వివరించింది. 2024 ఏడాదికల్లా ఆన్‌లైన్ షాపింగ్ ఒక వ్యసనపరమైన రుగ్మతగా మారే ప్రమాదముందని తెలిపింది.
Published date : 06 Nov 2019 06:13PM

Photo Stories