రూ. 64 వేల కోట్లతో ప్రత్యేక ఆరోగ్య నిధి... వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్
Sakshi Education
ఆరోగ్యం రంగంలో రూ.64,180 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
దీనికి పీఎం ఆత్మనిర్భర్ భారత్ ఆరోగ్య పథకం అనే పేరు పెట్టారు. దేశంలో కొత్తగా 9 బీఎస్‌ఎల్-3 స్థాయి ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే 15 అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
బడ్జెట్ ప్రసంగంలోని మరిన్ని అంశాలు
- నేషనల్ ఫస్ట్‌లో రైతుల ఆదాయం రెట్టింపు.
- మహిళా సాధికారత, యువత ఉపాధికి అధిక ప్రాధాన్యం.
- కొత్తగా నగర్ స్వచ్ఛ భారత్ మిషన్.
- మెగా టెక్స్‌టైల్స్ పార్కుల నిర్మాణం. రానున్న మూడేళ్లలో 7 టెక్స్‌టైల్ పార్కులు
- జాతీయ స్థాయిలో వ్యాధి నివారణ కేంద్రం.
- పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి జల్ జీవన్ అభియాన్
- భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్ అందజేత.
- దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌ల ఏర్పాటు.
Published date : 01 Feb 2021 11:46AM